Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: గౌడన్నలు ప్రతిరోజూ ప్రాణాలకు తెగించి నీరాను సేకరిస్తున్నారని, స్వచ్ఛమైన నీరాను ప్రజలకు అందిస్తున్న వారి కష్టాన్ని హేళన చేయొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. సోషల్‌మీడియాలో నీరాపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. మంగళవారం నెక్లెస్‌రోడ్‌లోని నీరాకేఫ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేఫ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్, తెలంగాణ పిండి వంటకాలు, మాంసాహార వంటకాలు, నీరా ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. నీరా కేఫ్‌కు వచ్చిన వినియోగదారులను కలిసి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు. నాణ్యమైన వంటకాలను ప్రజలకు అందించాలని మంత్రి నిర్వాహకులకు సూచించారు. ఎన్నో ఔషధ గుణాలున్న నీరాపై కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరా ప్రజలందరికీ చేరేలా, కేఫ్ ముఖ్య భూమిక పోషించేలా అధికారులు, స్టాల్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.