Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచంలో సూర్య కుమార్ యాదవ్ బెస్ట్ టి20 ప్లేయర్ అని బీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీ అన్నారు. నిన్న బెంగళూరుపై విశ్వరూపం చూపించిన ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై బీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీ ప్రశంసించారు. ‘ప్రపంచంలో సూర్య కుమార్ యాదవ్ బెస్ట్ టి20 ప్లేయర్. అతడు ఆడితే కంప్యూటర్ పై ఆడుతున్నట్లు అనిపిస్తుంది’ అని ట్విట్ చేశారు. ఇక అటు ముంబై, ఆర్సిబి మ్యాచ్ లో ముంబై బ్యాటర్ నిహాల్ వదెరా కొట్టిన సిక్సర్ స్టేడియంలో ఉన్న కారుకు తగిలింది. ప్లేయర్లకు బహుమతిగా ఇచ్చేందుకు నిలిపిన టాటా టియాగో కారు డోర్ హ్యాండిల్ కు బాలు తాకింది. దీంతో హ్యాండిల్ దగ్గర డెంట్ ఏర్పడింది. ఇదే సీజన్లో గైక్వాడ్ కొట్టిన సిక్సర్ కూడా కారుకు తగిలింది. ఒక్కసారి కారుకు తగిలితే టాటా కంపెనీ రూ.5,00,000ను కర్ణాటకలో కాఫీ మొక్కల పెంపకానికి డొనేట్ చేస్తుంది.