Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రశాంతంగా ఉండాలంటే అది మనకు చాలా అవసరం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు గానూ 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం బొమ్మై (బీజేపీ) శింగావ్ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య(కాంగ్రెస్) వరుణ నుంచి, శెట్టర్ (కాంగ్రెస్) హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్) చెన్నపట్టణ నుంచి బరిలో నిలిచారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.