Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబర్ 07046/07047 అనే ప్రత్యేక రైలు ఈనెల 15,18,22,25,29, జూన్ 1వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.50 గంటలకు దిబ్రూగఢ్‌కు చేరుకుంటుందని వివరించారు.
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు దిబ్రూగఢ్‌లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలు నల్గొండ మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపురం, కుర్ధారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, కృష్ణగంజ్, జల్పాయిగురి, న్యూతిన్సుకియా స్టేషన్లలో ఆగుతుందని అన్నారు.