Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గుపై అదనంగా అక్రమ పన్ను కేసులో మనీ లాండరింగ్ కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. తాజాగా రూ.51.4 కోట్లకుపైగా విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ మంగళవారం తెలిపింది. వీటిలో రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవేందర్ యాదవ్, చంద్రదేవ్ ప్రసాద్ రాయ్, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్‌లకు సంబంధించిన స్థిరాస్థులు, విలాసవంత వాహనాలు, ఆభరణాలు, నగదు ఉన్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి, నాటి రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ రాణు సాహూ, బొగ్గు వ్యాపారి, కేసులో ప్రధాన నిందితుడు సూర్యకాంత్ తివారీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది.
రాష్ట్రంలో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన కొద్దిరోజులకే ఈ ఆస్తుల జప్తు జరగడం గమనార్హం. ఈడీని బీజేపీ ఏజెంట్‌గా పేర్కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ దీనిని తప్పుడు కేసుగా అభివర్ణించారు.