Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ మణికొండలో చోటు చేసుకుంది. ఇంటర్ ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది… ఐదో అంతస్తుపైనుంచి దూకి విద్యార్థిని శాంతకుమారి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు ఖైరతాబాద్ లోని తుమ్మల బస్తీలో ఓ ఇంటర్ విద్యార్థి (బాలుడు) ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న వెలువడిన ఫలితాల్లో రెండోవ సంవత్సర ఫలితాలలో ఫెయిల్ కావడంతోఇంట్లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు.. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవగారానికి తరలించారు. విద్యార్థి పేరు గౌతమ్ కుమార్, ఇంటర్ రెండోవ సంవత్సరం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.