Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓ నవ వధువు ముస్తాబై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. ముదిగెరె నియోజకవర్గంలోని చిక్కమగళూరులోని పోలింగ్ బూత్ నంబర్ 165లో నవ వధువు ఓటేశారు. బాధ్యతాయుతంగా ఓటేసిన ఆ పెళ్లి కుమార్తెను ఎన్నికల అధికారులు అభినందించారు. మరికాసేపట్లో వివాహం ఉన్నప్పటికీ.. బాధ్యతాయుతంగా వచ్చి ఓటేసిన ఆ పెళ్లి కూతురును యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు సూచించారు. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ఓ పోలింగ్ బూత్‌లో కన్నడ యాక్టర్ గణేశ్, అతని భార్య ఇద్దరూ కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో పోలింగ్ బూత్‌లో నటుడు రమేశ్ అరవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. నటి అమూల్య, ఆమె భర్త ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు.