Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవ్వగా.. 11 గంటల సమయానికి 21 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఉడుపి జిల్లాలో 13.28శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.