Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: హీరో అజిత్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. త్వరలోనే అజిత్ మరోసారి బైక్‌పై సాహస యాత్ర చేయనున్నారట. ఈ సారి ఏకంగా ప్రపంచ యాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని అజిత్ మేనేజర్ ట్విటర్లో తెలిపారు. ‘అజిత్ ఇప్పటికే బైక్‌పై ఎన్నో సాహస యాత్రలు చేశారు. సవాళ్లతో కూడిన భూభాగంలో ప్రయాణించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇటీవలే దేశంలోని పలు రాష్ట్రాల్లో బైక్‌పై పర్యటించిన ఆయన.. త్వరలోనే మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో అజిత్ తన బైక్‌పై ప్రపంచయాత్ర మొదలుపెట్టనున్నారు’’ అని అందులో పేర్కొన్నారు. ఇక దీని కోసం అజిత్ ఓ తమిళ సినిమా షూటింగ్‌ను కూడా శరవేగంగా పూర్తి చేశారు.