Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మంగళవారం ఐర్లాండ్ – బంగ్లా మధ్య జరిగిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో వన్డే ప్రపంచ కప్పు -2023కు సౌతాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. దీంతో ఐర్లాండ్ వన్డే వరల్డ్ కప్పులో పాల్గొనాలంటే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాలి.
బంగ్లా – ఐర్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే మంగళవారం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీల ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముష్ఫీకర్ రహీమ్(61) అర్ధశతకం సాధించాడు. శాంటో, షకీబ్, మిరాజ్ రాణించారు. ఈ సిరీస్ కోసం ఐపీఎల్ నుంచి వచ్చిన జోషువా లిటిల్ మూడు వికెట్లు తీశాడు. మార్క్ అడైర్, హ్యూమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. 16.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 65 చేసింది. అదే సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిపేశారు. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఐర్లాండ్ మూడుకి మూడు మ్యాచులు గెలిచినట్లైతే నేరుగా వన్డే వరల్డ్ కప్‌నకు క్వాలిఫై అయ్యేది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడకుండానే సౌతాఫ్రికా వరల్డ్ కప్‌నకు అర్హత సాధించింది.