Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కవితకు స్వాగతం పలికారు. ముందుగా బేతాళ స్వామి దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండగట్టు అంజన్నకు కవిత ప్రజలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవితను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఉన్నారు.