Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లోనూ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు మెరిశారు. టీఎస్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా, ప్రభుత్వ పాఠశాలల్లో 72.39 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా ఈ జిల్లాల్లో 59.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఆయా పాఠశాలల వారీగా ఫలితాల వివరాలు...
టీఎస్ రెసిడెన్షియల్స్ – 98.25 శాతం
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సిల్స్ – 95.24 శాతం
బీసీ వెల్ఫేర్ – 95.03 శాతం
మైనార్టీ రెసిడెన్షియల్స్ – 94.66 శాతం
ట్రైబల్ వెల్ఫేర్ – 92.93 శాతం
మోడల్ స్కూల్స్ – 91.3 శాతం
ప్రయివేటు స్కూల్స్ – 90.9 శాతం
కేజీబీవీ స్కూల్స్ – 83.86 శాతం
ఎయిడెడ్ స్కూల్స్ – 83.85 శాతం
జిల్లా పరిషత్ స్కూల్స్ – 79.14 శాతం
ఆశ్రమ పాఠశాలలు – 77.67 శాతం
ప్రభుత్వ పాఠశాలలు – 72.39 శాతం