Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహించిన ఎస్ఐ, ఏఎస్ఎస్ తుది పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. ఈమేరకు పోలీసు నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస రావు వెల్లడించారు. ప్రిలిమినరీ కీ ఈ నెల 11న టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 14వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు తెలుపొచ్చన్నారు. అయితే ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు ఆధారాలను నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించారు. ఏఎస్ఐ ఎఫ్‌పీబీ, ఎస్ఐ ఐటీ అండ్ సీఓ టెక్నికల్ పేపర్ల (ఆబ్జెక్టివ్ టైప్) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్ఐ పీటీవో పరీక్షను మార్చి 26న, అరిథ్‌మెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ పేపర్లను ఏర్పిల్ 8న, జనరల్ స్టడీస్ పేపర్ల ఫైనల్ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 9న నిర్వహించిన విషయం తెలిసిందే.
వెబ్సైట్: www.tslprb.in