Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ నేతలు అకస్మాత్తుగా ప్రతిదానినీ పూజించడం ప్రారంభించారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్, ఆ పార్టీ నేతలు వంట గ్యాస్ సిలిండర్‌ను పూజించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వారు ఏదో ఓ దానిని పూజించడం స్వాగతించదగినదేనని తెలిపారు. డీకే శివ కుమార్, కాంగ్రెస్ నేతలు ఎల్పీజీ సిలిండర్లను పూజించడం ప్రారంభించారని, కనీసం ఏదో ఓ దానిని పూజించడం మంచిదేనని తేజస్వి సూర్య చెప్పారు. బజరంగ్ బలి దేవాలయాలను సందర్శించడం, వంట గ్యాస్ సిలిండర్లలో దేవుడిని చూడటం మంచిదేనని చెప్పారు. ప్రతిదానిలోనూ దేవుడు ఉన్నాడని హిందూ ధర్మం చెప్తోందన్నారు. కాంగ్రెస్ ఏదో ఓ పూజ చేస్తుండటం తమకు సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మంగళవారం డీకే శివ కుమార్ ఓ వంట గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేసి, హారతి ఇచ్చారు. ఓటు వేయడానికి వెళ్లడానికి ముందు సిలిండర్‌కు పూజ చేయాలని పిలుపునిచ్చారు. ఈ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘‘మీరు ఓటు వేయడానికి వెళ్లడానికి ముందు గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేయండి’’ అని గతంలో నరేంద్ర మోడీ చెప్పిన మాటలను వాయిస్ ఓవర్లో వినిపించారు.