Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ఉగ్ర కోణంలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్‌నగర్‌కు చెందిన సలాం అలియాస్ సల్మాన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్‌ను పోలీసులు భోపాల్‌కు తీసుకెళ్లిపోయారని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కదలికలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) అధికారులు మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ వచ్చి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. గోల్కొండ, టోలీచౌకీ ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్టు తెలిసింది. ఇక్కడ తలదాచుకున్న ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలతో పాటు భారీ మొత్తంలో ఇస్లామిక్ జిహాదీ సాహిత్యం, ఎయిర్గన్లు స్వాధీనం చేసినట్లు సమాచారం. అంతకుముందు ఏటీఎస్ అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సహకారంతో భోపాల్, ఛింద్వాడాలో 11 మందిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో దాడులు చేశారు. ఇక్కడ చిక్కిన ఆరుగురు కొన్ని నెలల క్రితం భోపాల్ నుంచి వచ్చి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తమకు అందిన ప్రాథమిక సమాచారంతో నెల క్రితం నుంచే నిఘా పెట్టినట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు.