Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఎంసీహెచ్ఆర్డీలో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 19న ఎదుర్కోలు ఉత్సవం, 20న అమ్మవారి కళ్యాణం, 21న రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం అమ్మవారి కల్యాణానికి 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారని, ఈ సంవత్సరం 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. కళ్యాణాన్ని అందరూ వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.