Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్భుతం సృష్టించిన కవలలు ప్రజ్ఞాని,శర్వాణి
నవతెలంగాణ శంకరపట్నం
అత్యంత అరుదుగా జరిగే అద్భుతాలలో ఇది ఒకటి అక్కడక్కడ ఆయా చోట్ల కుటుంబాలలో అరుదుగా కవలలు పుడుతుంటారు. చూపులకు ఒకే విధంగా పోలికలు కలిగి ఉంటారు. వివిధ మనస్తత్వాలు, నడవడికలు వారిలో ఉంటాయి కలిసి పుడతారు. శంకరపట్నం మండల కేంద్రంలొని కేశవపట్నం గ్రామానికి చెందిన గంప కవిత రెవెన్యూశాఖలో ఈ డిపార్ట్మెంట్ మేనేజర్ గా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తుంది, ఆమెకు కవల పిల్లలు జన్మించారు. వారే ప్రజ్ఞాని, శర్వాణి, వీరు పుట్టుకతో కేశవపట్నంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అమ్మ గంప కవిత సంరక్షణలో పెరుగుతున్నారు. కవలలుగా కలిసి పుట్టారు, కలిసి తిరుగుతూ, ఆటల్లోనూ, చదువుల్లోనూ ఒకరినొకరు తీసిపోకుండా పాల్గొంటూ సమ ప్రతిభను చాటుతున్నారు. అంతేకాకుండా వీరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివారు. కాగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన పదవ తరగతి పరీక్షలలో చూడటానికి ఒకే పోలికలతో ఉన్న వారిరువురు ఒకే రకంగా 10/10 జీపీఏను సాధించి అద్భుతాన్ని సృష్టించారు. ఒకటిగా పుట్టి, పెరుగుతూ, అద్వితీయ ప్రతిభను కనబరిచి అద్భుతాన్ని సృష్టించి పాఠశాలకు వన్నె తేవడం విశేషమని కవలలు ప్రజ్ఞానీ, శార్వానీలను పాఠశాల ప్రిన్సిపల్ చిట్టా జ్యోతి, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. అంతే కాకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.