Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బుధవారం ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా యూనివర్సిటీలో ప్రవేశించడంపై నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ గతవారం ఢిల్లీ యూనివర్సిటీలోని పీజీ మెన్స్ హాస్టల్‌కు చేరుకున్నారు. ఇక్కడ విద్యార్థులతో దాదాపు గంట సమయం గడిపారు. ఈ సందర్భంగా విద్యార్ళుతో కలిసి మెస్‌లో భోజనం చేశారు. హాస్టల్ రూల్ 15.13 ప్రకారం.. హాస్టల్ చదువుకునే వారు తప్ప మరెవరూ ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకూడదని నోటీసుల్లో పేర్కొంది.