Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం బుఽధవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిసెట్ పరీక్షకు 89.56శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 1,60,329 మంది విద్యార్థులు నమోదుచేసుకోగా, 1,43,592 మంది పరీక్ష రాశారు. బాలికలు 55,562 మంది, బాలురు 88,030 మంది పరీక్ష రాశారు. ప్రాథమిక కీ శనివారం, తుది కీ సోమ, మంగళవారాల్లో విడుదల చేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను పది రోజుల్లో విడుదల చేసి ఆ వెంటనే ప్రవేశాలకు షెడ్యూలు జారీ చేస్తామని పేర్కొన్నారు.