Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్‌గా మారిందని, వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. మోఖా తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ అండమాన్, వాయవ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని హెచ్చరించింది.
అల్ప పీడన ద్రోణి బుధవారం సాయంత్రం కల్లా బలహీనపడిందని ఐఎండీ పేర్కొన్నది. సైక్లోన్ మోఖా..శుక్రవారం నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశముందని వివరించింది. రాష్ట్రంలో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. ఆదిలాబాద్‌లో 41.3, ఖమ్మంలో 40, నల్లగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 38.8, హనుమకొండ 38, హైదరాబాద్ 36.6, మెదక్ 39, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.