Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఒకే రోజు మూడు చోట్ల భూకంపం సంభవించింది. గురువారం నాడు టాంగా దేశంతోపాటు భారతదేశంలోని ఉత్తరాఖండ్,అఫ్ఘానిస్థాన్ దేశంలో ఫైజాబాద్ ప్రాంతాల్లో ఒకే సారి భూకంపాలు సంభవించాయి.టాంగాలో సంభవించిన భారీభూకంపం రిక్టర్ స్కేలుపై 7.6 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే ట్వీట్ చేసింది.టాంగాలోని హిహిపోకు 95 కిలోమీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున 4.02 గంటలకు 210 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు.ఆఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ నగరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాఘడ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.