Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో శుక్రవారం (ఈనెల 12న) విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్కామ్ కేసులో పాటిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే నవనిర్మాన్ సేన రాజ్ థాక్రేను ఈడీ ప్రశ్నించింది.
కోహినూర్ సీటీఎన్ఎల్ పెట్టుబడుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సంస్థకు ఎల్ఎఫ్ అండ్ ఎఫ్ పెట్టుబడులు సమకూర్చించిందని, అయితే కోహినూర్ కన్స్ట్రక్షన్స్ తిరిగి ఆ సొమ్మును చెల్లించకపోవడంతో డీఫాల్టర్‌గా ప్రకటించారని పేర్కోంది. ఈ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, కోహినూర్ సీటీఎన్ఎల్ దాదర్ వెస్ట్‌లో కోహినూర్ స్క్వేయర్ పేరుతో భారీ టవర్‌ను నిర్మిస్తున్నది.