Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లండన్ : ముగ్గురి డీఎన్ఏతో శిశువు జన్మించిన అరుదైన ఘటన లండన్లో జరిగింది. శిశువు తల్లిదండ్రులతో పాటు ఓ మహిళా దాత డీఎన్ఏతో నూతన పద్ధతిలో లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రత్యుత్పత్తి జన్యుశాస్త్ర ప్రొఫెసర్ డగన్ వెల్ ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మైటోకాండ్రియల్ వ్యాధి సోకి కొంత మంది తమ పిల్లలను కోల్పోతున్నారు. ఈ వ్యాధి తల్లి పిండం వల్ల సోకుతుంది. దీన్ని నివారించేందుకు వైద్యులు మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్మెంట్పై పరిశోధనలు చేశారు. దాత నుంచి ఆరోగ్యకరమైన పిండం కణాలను సేకరించారు. వాటిని ఐవీఎఫ్ పిండంగా ఫలదీకరణం చేసి, తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. శిశువుకు తండ్రి లక్షణాలు వచ్చాయని, ఇద్దరి కండ్లు ఒకేలా ఉన్నాయని వైద్యులు తెలిపారు.