Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 62,002 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 18,327 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు కుంగి 82.96 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, విప్రో, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, ఐటీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు సైతం నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. అయితే, అమెరికాలో ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం రెండున్నరేళ్ల కనిష్ఠానికి పడిపోవడం గమనార్హం. చైనాలోనూ ద్రవ్యోల్బణం కట్టడి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు నాలుగో త్రైమాసిక ఫలితాలు సైతం బలంగా ఉండడం మార్కెట్లకు కలిసొచ్చే అంశం. అలాగే నేడు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1,833.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు రూ.789.67 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.