Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు యాజమాన్యం తాజాగా మరో షాకిచ్చింది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సంస్థలోని ఫుల్ టైం ఉద్యోగుల జీతాలను పెంచబోమని తాజాగా స్పష్టం చేసింది. బోనస్‌లు, స్టాక్ అవార్డులు, ఇతర ప్రోత్సాహకాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని చెప్పింది. ఈ జనవరిలో మైక్రోసాఫ్ట్ ఏకంగా పది వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తాజాగా స్పందించారు. సంస్థ ఉద్యోగులు, వ్యాపారం, భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న ఇది మరింత ఆవశ్యకమని చెప్పారు. సంస్థ సీఈఓ సత్య నాదేళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కృత్రిమే మేథపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ సంస్థలో పెట్టుబడులు కుమ్మరించింది. అంతేకాకుండా, ఏఐ ఉత్పత్తులను బింగ్ సర్చ్ ఇంజిన్‌తో పాటూ మైక్రోసాఫ్ట్ ఇతర ఉత్పత్తుల్లో సమ్మిళితం చేస్తోంది.