Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఫిన్లాండ్: ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో దేశ అత్యున్నత పదవి చేపట్టిన ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సనా మారిన్ తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడిపోనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. తాము విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు.‘మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పుడు మేమిద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. ఇకపై మంచి స్నేహితులుగా నే ఉంటాం. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తాం’ అని సనా మారిన్ చెప్పుకొచ్చారు.