Don't wander through a work area pic.twitter.com/n12dU11Mo8
— OnlyBangers.eth (@OnlyBangersEth) May 8, 2023
Authorization
Don't wander through a work area pic.twitter.com/n12dU11Mo8
— OnlyBangers.eth (@OnlyBangersEth) May 8, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : చైనాలో జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబందించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అప్పటివరకు చంటిబిడ్డను ఎత్తుకుని హాయిగా తిరిగిన తల్లి.. క్షణాల వ్యవధిలో జరిగిన ఓ సంఘటన వారిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలోని డాంజియాంగ్కౌలో ఈ సంఘటన జరిగింది. నిర్మాణదశలో ఉన్న ఓ భవనంలో ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకుని అక్కడ నుండి వెళ్తుంది. అదే సమయంలో పక్కనే ఆగిన ఉన్న ఓ వాహనం టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అప్పటికే ఆ వాహనం పక్కన మరో ఎక్స్ట్రా టైర్ ఉండడం.. వెహికల్ టైర్ బ్లాస్ట్ కావడంతో దాన్ని అనుకుని ఉన్న ఆ టైర్ ఎగిరివచ్చి పక్కన చంటిబిడ్డతో ఉన్న మహిళను తాకడంతో ఆమె గాల్లో ఎగిరిపడింది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. అయితే, ఆ తల్లీబిడ్డకు ఏమైందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ నెల 9వ తేదీన పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.51లక్షల మంది వీక్షించారు. ఇక వీడియో చూసిన వారందరూ ఆ తల్లీబిడ్డ క్షేమంగా ఉంటే చాలు అని కోరుకుంటున్నారు.