Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మనిషికి సరిపడ ఆక్సిజన్ దొరికినప్పుడే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని. దాంతో ప్రతీ సంఘటనను పాజిటివ్ గా తీసుకునే శక్తి మెదడుకు అందుతుందన్నారు ప్రముఖ స్టాండప్ కమెడియన్, హాస్యనటులు కపిల్ శర్మ. నేడు ముంబాయిలోని గోరేగాన్ లో ఉన్న దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీలో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో భాగంగా రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కను నాటారు కపిల్ శర్మ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఉన్నత ఆశయంతో కూడుకున్నదన్నారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నా మనసును కదిలించింది. 'మనం మన కోసం కాదు.. ఇతరుల కోసం కూడా' అనే భావనను నాలో కలిగించింది. 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఈ నేలపై మన భవిష్యత్ తరాలు బావుండాలని తలపెట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇదొక కార్యక్రమంలా కాకుండా మన బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకుపోవల్సిన అవసరం ఉంది. యావత్ దేశ ప్రజలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. నా షో వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటాలి.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పచ్చని ఆశయానికి అండగా నిలవాలని నా అభిమానులను కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రాబోయే వర్షా కాలంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాన్నారు కపిల్ శర్మ.