Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట : నేడు బాల్ భవన్ సమ్మర్ క్యాంప్ లో షి టీమ్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, పోలీస్ కళా బృందం పాల్గొని పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురుంచి తెలిపారు, ఏ ఎస్ ఐ నాయక్ మాట్లాడుతూ పిల్లలను ఒంటరిగా పంపించడం గాని పరిచయం లేని వ్యక్తులతో పంపడం కానీ చేయకూడదని, వారిని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారని పేరెంట్స్ పిల్లల్ని గమనించుకుంటు వుండాల్సిన అవసరం వుందని అన్నారు , అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి,జాఫర్,శివరాం తదితరులు మాట్లాడుతూ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని గుర్తించి షి టీం నెంబర్ కు ఫోన్ చేసి తెలియపరచవలసిందిగా చెప్పడం వల్ల తదుపరి వారు వారికి రక్షణ కల్పిస్తామని తెలియజేయడం జరిగినది, చిన్నపిల్లలు సెల్లులు, టీవీల ముందు కనిపించడం పరిపాటి అయిపోయింది కానీ అనుమతి లేకుండా సెల్ఫోన్ వాడకుండా చూసుకోవలసిన జాగ్రత్త పేరెంట్స్ దే , వివిధ కార్యక్రమాలలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉండటం వల్ల చిన్న పిల్లలను కొందరు మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లి వారిని అఘాయిత్యాలకు పాల్పడుతరు కాబట్టి తల్లిదండ్రులు గమనించి పట్టి అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ గాని షి టీమ్ కి గానీ తెలియజేయవలసిందిగా కోరడమైనది,తదుపరి పోలీస్ కళా బృందం ఎల్లయ్య, గోపయ్య, నాగరాజు పాటల మాటల రూపంలో అవేర్నెస్ కల్పిస్తూ పిల్లలను ఉత్తేజపరిచారు. బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి,సిబ్బంది కలిసి తదుపరి క్యాంప్ లో ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించిన షి టీమ్ పోలీస్ కళా బృందం వారికి అందరికీ సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎల్లయ్య, సింగ్, ఉమా, అనిల్, సాయి, వీరు, పద్మ, సునీత, సంధ్య,స్టూడెంట్స్, పేరెంట్స్ పాల్గొన్నారు.