Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై గత ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతో ఓ పిటిషన్, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు శ్రీనివాస్, ఎన్ఐఏ నుంచి కూడా కౌంటర్లు దాఖలయ్యాయి. జగన్ పై కోడి కత్తితో దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చారు. అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న పిమ్మట కేసు విచారణను న్యాయమూర్తి జూన్ 15కి వాయిదా వేశారు.