Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్ అధ్యక్షతన సీఎం కప్ నిర్వహణపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుండి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో నిర్వహించ తలపెట్టిన పోటీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్ బాల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 15 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, డిప్యూటీ ఎమ్మార్వో సవై సింగ్, సూపర్డెంట్ శ్రీనివాస్, ఎంపీఓ రామకృష్ణ మరియు ఏఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.