Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : 'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్'. శ్రీలీల కథానాయిక వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్‌సింగ్' ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా, పదకొండేళ్ల కిందట 'గబ్బర్ సింగ్' ఇదే తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ మాస్ పోలీస్ గెటప్ కనిపిస్తున్నాడు. ఫుల్ ఎనర్జిటిక్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించాడు. ఇక చివర్లో ఈసారి పెర్ఫామెన్స్ బద్దలై పోద్ది.. అనే డైలాగ్ తో ఈ చిత్రంపై భారీగా అంచానలు పెరిగాయి.