Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం-ఢిల్లీ సర్వీసుల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఇది చరిత్రాత్మక తీర్పు అని ప్రశంసించారు. దేశ రాజధాని నగరంలోని సర్వీసెస్‌పై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015లో జారీ చేసిన నోటిఫికేషన్‌పై మండిపడ్డారు. కేజ్రీవాల్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తన చేతులను కట్టేసి, నీటిలో పడేసినప్పటికీ, తన నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి పనులు చేసిందన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు.