Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ కేసుపై విచారణ చేపట్టింది. గంటలోగా ఇమ్రాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరోకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇమ్రాన్ అరెస్టుపై విచారణ చేపట్టింది. కోర్టు సరైన ఆదేశాలు ఇస్తుందని సీజేపీ తెలిపారు. ఇమ్రాన్ అరెస్టు విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు కోర్టు చెప్పింది. సుప్రీం ఆదేశాల తర్వాత ఆ కోర్టు ప్రాంగణంలో సెక్యూర్టీని పెంచేవారు. రేంజర్లు, బాంబు డిస్పోజ్ స్క్వాడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇస్లామాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ అక్బర్ నాసిర్.. ఇవాళ ఇమ్రాన్ ఖాన్‌ను అత్యవసరంగా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.