Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2023 16వ సీజన్ లో భాగంగా నేడు కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 56వ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో రెండు జట్లు 11 మ్యాచ్ లు ఆడగా.. 5 మ్యాచ్ లు గెలిచి 6 ఓడిపోయాయి. అయితే రాజస్థాన్ జట్టు టేబుల్ లో 5వ స్థానంలో ఉండగా. కోల్కతా జట్టు 6వ స్థానంలో ఉంది.