Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆర్మూర్
ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగిందని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ జ్యోతి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవడం అనేది మహా నేరం, వారిని కన్న తల్లిదండ్రులకు తీరని శోభంగా మిగులుతుందని ఆయన తెలిపారు, టెంటు గాని ఇంటర్ గాని డిగ్రీ గాని ఏదైనా కావచ్చు ఫెయిల్ అయితే మళ్లీ రాసుకునే అవకాశం ఉంటుంది కానీ మరి చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. ప్రపంచంలో అనేక రంగాలలో చదువుతో సంబంధం లేకుండా కూడ అనేక రంగాలలో రాణిస్తున్నారని ఆయన తెలిపారు. ఉదాహరణకు కేఎఫ్సి స్థాపించిన వ్యక్తి సాధారణ దినసరి అధినేత కలన్ సాండర్స్ ఈరోజు కొన్ని వేల కేఎఫ్సి సంస్థలు నిర్మించడం జరిగిందైన కొన్ని వేల మంది ఉద్యోగాలు ఆయన సంస్థలో పనిచేస్తున్నారని తెలుపడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ కూడా ఫాదర్ ది ఫెయిల్ అయిన కూడా ఆయన పట్టుదలతో క్రియేట్ రంగంలో రాణించి ఇప్పుడు అనేక మంది అభిమానులను సంపాదించడం జరిగింది. మరి విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా కొన్ని మోటివేషన్ వీడియోలు చూడాలని అదేవిధంగా ఫెయిల్ అయితే గనుక పదేపదే అవే జ్ఞాపకాలు గుర్తుకొస్తే వారి బాధ లను తల్లిదండ్రులు గాని స్నేహితులతో గాని ఎవరైనా దగ్గరి బందులతోని షేర్ చేసుకోవాలని తెలిపారు.