Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సొంత గ్రౌండ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు స్పిన్ ఉచ్చులో పడ్డారు. చాహల్ 4 వికెట్లతో కోల్‌కతాను దెబ్బకొట్టాడు. వెంకటేశ్ అయ్యర్(57), నితీశ్ రానా(22) ఆదుకున్నారు. రింకూ సింగ్(16) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దాంతో, కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు కొట్టింది. డేంజర్ ఓపెనర్లు జేసన్ రాయ్(10), రహ్మనుల్లా గుర్బాజ్(18)ను బౌల్ట్ పెవిలియన్ పంపాడు. . 29 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. కష్టాల్లో పడిన కోల్‌కతాను వెంకటేశ్ అయ్యర్(57), నితీశ్ రానా(22) ఆదుకున్నారు. చాహల్ ఓకే ఓవర్లో వెంకటేశ్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్(1)ను ఔట్ చేసి కోల్‌కతాను దెబ్బతీశాడు. తన ఆఖరి ఓవర్లో రింకూ సింగ్(16)ను పెవిలియన్ పంపాడు. దాంతో, కోల్‌కతా భారీ స్కోర్ చేయలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, అసిప్ ఒక్కో వికెట్ తీశారు.