Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇక భవిష్యత్ అంతా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రాజ్యమేలుతుందని టెక్ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో... ప్రముఖ సెర్చింజన్ లు ఏఐ బాటపడుతున్నాయి. ఇటీవల ఓ సంచలనంగా చాట్ జీపీటీ రంగప్రవేశం చేయడంతో మైక్రోసాఫ్ట్ బింగ్, గూగుల్ క్రోమ్ ఏఐ సొబగులు దిద్దుకున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ 'బింగ్ చాట్' ను పరిచయం చేయగా, తాజాగా గూగుల్ కూడా తన 'బార్డ్' టూల్ ను గూగుల్ ఏఐ 2023 సదస్సులో ఆవిష్కరించింది. గూగుల్ 'బార్డ్' ను ఉపయోగించడం సులువే. బ్రౌజర్ లో 'గూగుల్ బార్డ్' అని టైప్ చేస్తే... గూగుల్ బార్డ్ కి సంబంధించిన అనేక అంశాలు సెర్చ్ రిజల్ట్స్ లో ప్రత్యక్షమవుతాయి. అందులోకి లాగిన్ అవ్వాలంటే జీమెయిల్ అకౌంట్ ఉండాల్సిందే. టర్మ్స్ అండ్ కండిషన్స్ కు ఒప్పుకుంటున్నట్టు ఐ అగ్రీ అనే బటన్ నొక్కితే 'బార్' పేజి తెరుచుకుంటుంది. మన ఓపిక ఉన్న కొద్దీ ఎంత సమాచారం కావాలంటే అంత సమాచారం దీన్నుంచి పొందవచ్చు. సమాచారం పొందడానికి ఎలాంటి పరిమితి లేదు. టెక్ట్స్ రూపంలో మనకు కావాల్సిన వివరాలను బార్డ్ అందిస్తుంది. 'బార్డ్' ద్వారా పొందే సమాచారాన్ని మనం ఇతరులతోనూ పంచుకోవచ్చు. ఒకవేళ 'బార్డ్' తప్పుడు సమాచారం ఇస్తే... రిపోర్ట్ లీగల్ ఇష్యూ అనే ఆప్షన్ ద్వారా గూగుల్ కు నివేదించవచ్చు. అయితే, తొలుత ఇంగ్లీషులోనే 'బార్డ్' తో చాటింగ్ చేసే అవకాశం ఉంది. క్రమంగా ఇతర భాషల్లోనూ 'బార్డ్' తో చాట్ చేసే వెసులుబాటు కల్పించనున్నారు.