Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 67వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధ, గురువారాల్లో నిర్వహించిన అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగ పరీక్షలు సజావుగా ముగిశాయి. గురువారం ఉదయం సెషన్‌కు తెలంగాణలో 93.28శాతం, ఏపీలో 87.88 శాతం చొప్పున మొత్తం 92.31 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు తెలంగాణలో 94.63 శాతం, ఏపీలో 88.41 శాతం చొప్పున మొత్తం 93.52శాతం విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి పర్యవేక్షించినట్టు ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.