Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
పెండ్లింట విషాదం నెలకొన్నది. వివాహానికి ఒక రోజు ముందు విద్యుత్తు షాక్‌తో వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం తండాలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ-కాంతి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దకొడుకు యాకూబ్ (21) హైదరాబాద్‌లో రైల్వే కాంట్రాక్టర్ వద్ద పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో వివాహం కుదిరింది. పెండ్లి కోసం యాకూబ్ సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. శుక్రవారం పెండ్లి జరగాల్సి ఉండగా ఇంట్లో బంధువులతో సందడి నెలకొన్నది. గురువారం ఇంట్లో నీళ్లు అయిపోవడంతో బోర్ మోటర్ స్విచ్ వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై కిందపడ్డాడు. వెంటనే బంధువులు, స్థానికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. తెల్లారితే పెండ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.