Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై: ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. నగరంలోని చెప్పాక్కం స్టేడియంలో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. కానీ, ఈ టిక్కెట్ విక్రయాలు ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అదేసమయంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో జోరుగా ఐపీఎల్ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఆ విధంగా ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయించినందుకు 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.18,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని పట్రవాక్కం మోహన్, ఎలిఫెంట్గేట్కు చెందిన తమిళ్మణి, టి.నగర్‌కు చెందిన ప్రదీప్ రాజ్, పురసైవాక్కంకు చెందిన దినేష్ కుమార్, చెప్పాక్కంకు చెందిన మునివేల్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన త్రినాథ్ రెడ్డి లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదుతోపాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.