Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఓ 18 అడుగుల బర్మన్ కొండచిలువకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వామ్మో.. కొండచిలువ ఇలా చేసిందేంటి? అని షాక్ అవుతున్నారు. ఇంతకీ కొండచిలువ ఏం చేసిందంటే.. 5 అడుగుల మొసలిని ప్రాణాలతో ఉండగానే అమాంతం మింగేసింది. ఆ తర్వాత కక్కలేక మింగలేక నానాపాట్లు పడి చివరికి ప్రాణలు కోల్పోయింది. ఇక కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి కూడా ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన బర్మాలో జరిగింది. వైద్యులు కొండచిలువ పొట్టకోసి మొసలిని తీసే ప్రయత్నం చేయగా అది అప్పటికే మృతిచెందింది. ఆ కొండచిలువ సుమారు ఐదడుగుల మొసలిని మింగేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అరగించుకోలేక ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ నెల 5న టెర్రిఫయింగ్ నేచర్ అనే ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 15.3 మిలియన్ల మంది వీక్షించారు. అలాగే 94వేల వరకు లైక్స్ వచ్చాయి.