Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మెహిదీపట్నం: కాలిబాటపై ఉన్న గోనె సంచిలో వ్యక్తి మృతదేహాన్ని లంగర్‌హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి 10:45 గంటల సమయంలో లంగర్‌హౌస్ మిలటరీ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న కాలిబాటపై ఉన్న సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంచిని తెరిచి చూడగా అందులో ముక్కలు ముక్కలుగా నరికిఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది. వాటిని శవపరీక్ష కోసం ఉస్మానియా శవాగారానికి తరలించారు. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంచిని ఇక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లంగర్‌హౌస్ టిప్పుఖాన్ బ్రిడ్జి వైపు నుంచి ఈ ఆటో వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. బండ్లగూడ నుంచి సంఘటనా స్థలం వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.