Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోల్‌కతా: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధించారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అతను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్‌కు వచ్చిన బట్లర్ ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బ్యాటర్ వద్దు అంటూ చేయితో సంకేతం ఇస్తున్నా.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జైస్వాల్ అలాగే పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇక దిక్కుతోచని స్థితిలో బట్లర్ రన్ కోసం ఉరికాడు. కానీ రనౌట్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో బట్లర్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 బట్లర్ ఉల్లంగించినట్లు ఐపీఎల్ పేర్కొన్నది. మ్యాచ్ రిఫరీ ప్రకారం అతనికి శిక్ష పడింది. దీంతో ఫీజులో 10 శాతం కోత విధించారు.