Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో మరో పరువు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన యువతి, దళిత యువకుడిని ప్రేమించుకున్నారని వారిద్దరినీ అతి కిరాతకంగా చంపారు. ఈ దారుణంలో యువతి తండ్రితో పాటు బంధువులు హత్యలో పాలు పంచుకున్నారు. అనంతరం ఓ చెట్టుకు ఉరేసి వారిది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ చేసిన పాపం ఊరికే పోదు అన్నట్లు అడ్డంగా దొరికిపోయారు.
యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఓ అగ్రకుల మైనర్ యువతి దళిత యువకుడు ఇద్దరు లవ్ చేసుకున్నారు. వీరి ప్రేమ గురించి యువతి ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ల ప్రేమ గురించి తెలియగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో యువతి కుటుంబసభ్యులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ముందు తమ అమ్మాయిని ప్రేమించిన దళిత యువకుడిని పట్టుకుని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడిని దారుణంగా కొట్టిచంపారు. అనంతరం యువతిని కూడా అక్కడికి తీసుకువచ్చి అలాగే చంపేశారు.