Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుక్రవారం 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు తన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/ వెబ్సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునే సమయంలో అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. సీబీఎస్ఈ ప్రకారం, ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 87.33 శాతంగా నమోదైంది. దీంతో 2019లో వచ్చిన 83.40 శాతం ఉత్తీర్ణతను అధిగమించినట్లు అయింది. మొత్తం ఉత్తీర్ణత శాతం 87.33 శాతం కాగా.. త్రివేండ్రం ప్రాంతం 99.91 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో ఉంది. 78.05 శాతంతో ప్రయాగ్‌రాజ్ జాబితాలో చివరి స్థానంలో ఉంది. బాలికలు 90.68 ఉత్తీర్ణతతో 6.01శాతం మంది బాలుర కంటే మెరుగ్గా ఉన్నారు.