Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలోని హిజ్బ్-ఉత్-తహ్రీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు డార్క్ వెబ్సైట్, రాకెట్ చాట్, థిమ్రా యాప్‌తో చాటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. మరో ఆరుగురు హైదరాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన యాసిర్ ఆదేశాల మేరకు సలీం హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులు 18 నెలలుగా హైదరాబాద్ పాతబస్తీలో నివసిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కొంతకాలంగా వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందం హైదరాబాద్ వచ్చింది. నగరంలో హిజ్భ్ ఉత్ తహ్రీక్ సంస్థ కార్యకలాపాలను వివరించారు. ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఉగ్రవాద గ్రూపులు తమ ప్లాన్‌ను మూడు దశల్లో అమలు చేయాలని ప్లాన్ చేశాయి. నిందితులు దాడులు చేసేందుకు అనంతగిరి అడవుల్లో శిక్షణ పొందినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులు పేలుడు పదార్థాల తయారీ, తుపాకులు కాల్చడంలో శిక్షణ పొందినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మాల్స్, ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే ప్రాంతాలపై దాడి చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. అంతేకాదు, నిందితులు కనీసం రెండు రోజుల పాటు తినకుండా, తాగకుండా ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించారు.