Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షహరాన్‌పూర్: యూపీలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో మందు కొట్టాడు. షహరాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి చైర్లో కూర్చుని ఓ వ్యక్తి మందు సీసాతో గ్లాసులో మందు పోస్తున్న ఓ ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో ఆ స్టేషన్ ఇంచార్జ్‌ను సస్పెండ్ చేశారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇమ్రాన్‌గా గుర్తించారు. ఇంచార్జ్ ఆఫీసర్ సచిన్ త్యాగి చైర్లో కూర్చున్న అతను గ్లాసులో మందు పోస్తూ కనిపించాడు. టేబుల్‌పై చక్నా ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. మార్చిలో హోలీ పండుగ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు.