Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సోమేశ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. మాజీ ప్రధాన కార్యదర్శి అయిన సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.