Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని మురళీధర్బాగ్లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.